Monday, June 18, 2007

అన్నయ్యలందరు చూడవలసిన చిత్రం "ANNA VARAM"

ఈ చిత్రం లొ అన్న గా పవన్ కళ్యాణ్, చెల్లి గా సంధ్య నటన ఎక్సలెంట్. ఇద్దరు నిజంగా తోడబుట్టిన వాళ్ల లాగా నటించారు అనే కంటే జీవించారు అన్టే apt గా ఉంటుంది. ఈ చిత్రం లో Especially కొన్ని సీన్స్ noteworthy. వేణు మాదవ్ చనిపొయే సీన్, తెలంగాణ శకుంతల ఎడ్చే సీన్, పవన్ కళ్యాణ్ & సంధ్య మధ్య సీన్స్ లో డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ప్రతిభ తెలుస్తుంది. రమణ గొగుల సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఈ సినిమా లో వేణు మాదవ్ మొట్టమొదటి సారి ఎక్కడా శ్రుతి మించకుండా నటించాడు.ఈ సినిమా లో ఇంకొ చెప్పుకో తగ్గ విషయం ఎక్కడా vulgarity లేకపొవడం. ఈ మధ్య కాలం లో చాలా నీట్ గా తీసిన సీనిమా ఇదే. Even పవన్ కళ్యాణ్ కత్తి తో చంపే సీన్స్ లో కూడా ఎక్కడా direct గా పొడిచినట్టు చూపించరు. Too much of blood shed, item songs ఇవేవి లేకుండా కథకు తగ్గట్టుగా తీసారు. కుటుంబం అంతా కలసి చూడదగిన చిత్రం అన్నవరం, ముఖ్యంగా ప్రతి అన్న చూడవలసిన చిత్రం ఈ అన్నవరం.

Thursday, June 14, 2007

మంచి హింది సినిమా - Khosla ka Ghosla

ఈ మధ్య నేను చూసిన వాటిలో నాకు బాగా నచ్చిన హింది సినిమా " Khosla ka Ghosla". అనుపమ్ ఖేర్ ఎంత అద్బుతమైన నటుడొ చెప్పడానికి ఈ సినిమా చక్కని ఉదహరణ.ఈ సినిమా కథ ఇప్పటి పరిస్థులకు అద్దం పడుతుంది.ఓక తండ్రి అవేదనకు, పిల్లల బాధ్యతలకు, రీయల్ ఎస్టేట్ మొసాలకు ఈ సినిమా చక్కని సమాధానం చెపుతుంది. ఓక ప్లాటు కొనడానికి అనుపమ్ ఖేర్ పడే కష్టం, దానిని కాపాడుకొడానికి పడే మరిన్ని కష్టాలతొ సినిమా మంచి రసవత్తరంగా సాగుతుంది. సినిమాలొ చాలా సీన్స్ సహజత్వానికి దగ్గరగా ఉన్నాయ్. అందరి పాత్రలకు దర్శకుడు న్యాయం చేకుర్చాడు. సినిమా చూస్తున్నంత సేపు అస్సలు బొరే కొట్టదు.ఎవరి పాత్ర అనవసరంగా ఉందే అని అనిపించదు. దర్శకుడు చాలా శ్రద్దగా పని చేసిన సినిమా ఇది. అందరు తప్పక చూడాల్సిన చిత్రం. ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటి.

Hapy Viewing.

ఇట్లు
మీ రాఘవ

Tuesday, June 12, 2007

iLayaraajaa

ఇళయరాజా ఒక గొప్ప మ్యుజిక్ డైరెక్టర్.సాగర సంగమం, అభినందన, రుద్రవీణ, స్వర్ణకమలం, స్వాతిముత్యం ఇలా ఎన్నెన్నొ మ్యుజికల్ హిట్స్ ఇచ్చిన ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇళయరాజా ప్రయివేటు ఆల్బములు
How to Name it (1986) & Nothing but the Wind (1988), indian & western classical music కి best examples.
నేను మొట్టమొదటి సారిగా రాస్తున్న బ్లాగు ఇది. ఇందులొ ముఖ్యంగా సినిమాల గురించి నా అభిప్రాయాలు తెలియచేస్తున్నాను.అది ఒక పాట గురించి కావచ్చు లేదా ఒక సినిమా గురించి కావచ్చు లేదా ఒక సినిమాకు సంభందించినా వ్యక్తి గురించి కావచ్చు వగైరా వగైరా.

This is a blog where i will put my views about movies from different languages