ఈ మధ్య నేను చూసిన వాటిలో నాకు బాగా నచ్చిన హింది సినిమా " Khosla ka Ghosla". అనుపమ్ ఖేర్ ఎంత అద్బుతమైన నటుడొ చెప్పడానికి ఈ సినిమా చక్కని ఉదహరణ.ఈ సినిమా కథ ఇప్పటి పరిస్థులకు అద్దం పడుతుంది.ఓక తండ్రి అవేదనకు, పిల్లల బాధ్యతలకు, రీయల్ ఎస్టేట్ మొసాలకు ఈ సినిమా చక్కని సమాధానం చెపుతుంది. ఓక ప్లాటు కొనడానికి అనుపమ్ ఖేర్ పడే కష్టం, దానిని కాపాడుకొడానికి పడే మరిన్ని కష్టాలతొ సినిమా మంచి రసవత్తరంగా సాగుతుంది. సినిమాలొ చాలా సీన్స్ సహజత్వానికి దగ్గరగా ఉన్నాయ్. అందరి పాత్రలకు దర్శకుడు న్యాయం చేకుర్చాడు. సినిమా చూస్తున్నంత సేపు అస్సలు బొరే కొట్టదు.ఎవరి పాత్ర అనవసరంగా ఉందే అని అనిపించదు. దర్శకుడు చాలా శ్రద్దగా పని చేసిన సినిమా ఇది. అందరు తప్పక చూడాల్సిన చిత్రం. ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటి.
Hapy Viewing.
ఇట్లు
మీ రాఘవ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment